సర్కారు బడికి.. సర్పంచ్‌ కుమార్తె..

17 Jul, 2019 12:19 IST|Sakshi

సాక్షి, అలంపూర్‌(మహబూబ్‌నగర్‌): గ్రామానికి ప్రథమ పౌరురాలు (సర్పంచ్‌) తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ సర్పంచ్‌ నాగేశ్వరి మంగళవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తె సాత్వికను మూడో తరగతిలో చేర్పించింది. అలాగే గ్రామానికి చెందిన మరో ఎనిమిది మంది గ్రామ చిన్నారులను చేర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారని, కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే తమ చిన్నారులను చదివించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజు, పాఠశాల హెచ్‌ఎం కృపయ్య, గ్రామ కార్యదర్శి చంద్రకళ, సర్పంచ్‌ భర్త శివుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు