పేదింట్లో పెళ్లికి చేయూత

9 May, 2018 12:04 IST|Sakshi
పెళ్లి సామగ్రి అందిస్తున్న సభ్యులు

సారంగాపూర్‌(జగిత్యాల) : పేదింట్లో పెళ్లికి అన్నీ తామై అండగా నిలబడింది సత్యసాయి సేవాసమితి. సారంగాపూర్‌ గ్రామంలో జరిగే   పెళ్లింటి వారికి కావల్సిన ముఖ్యమైన వస్తువుల నుంచి కా పురం ఏర్పాటు చేసుకోవడానికి నూతన జంటకు అవసరమైన సామగ్రి అందించి పెళ్లి పెద్దగా నిలి చింది. సారంగాపూర్‌కు చెందిన గంగాధరి నర్సయ్య–తేజమ్మ  కుమార్తె జమున(మానస) వివాహం గంగాధర్‌తో బుధవారం జరగనుంది.

నర్సయ్య–తేజమ్మది నిరుపేద కుటుంబం కావడంతో పెళ్లి ఖర్చులు వారికి ఇబ్బందికరంగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాలకు చెందిన  సత్యసాయి సేవా సమితి సభ్యులు గుండ రాజశేఖర్‌–అర్చన, గుండ వెంకటేశం–సువర్ణ తమ వంతు సహాయంగా మంగళసూత్రం, మెట్టెలు, బట్టలు, పెళ్లి చీర, తాంబూలం, పళ్లెం, గ్లాసులు, బిందె, మంగళహారతి, అవసరమైన ఇతర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు బట్టు రాజేందర్, కొటగిరి మహేందర్, వంగల లక్ష్మీనారయణ, మహంకాళి మహేశ్, అరుణ, శ్రీలత, పద్మజ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.  

భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సంస్థ

జగిత్యాల: మండలంలోని గుట్రాజ్‌పల్లికి చెందిన మల్లేశం–సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రిక రజిని వివాహానికి భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సంస్థ వారు రూ.10 వేలు ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సుదర్శన్,  భూమేశ్వర్, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు