విద్యుత్ సరఫరాలో సవాళ్లున్నాయ్...

16 Aug, 2014 03:08 IST|Sakshi
 •     నష్టాలు తగ్గించేందుకు కార్యాచరణ
 •      ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ
 • హన్మకొండ సిటీ : రాష్ట్రంలో విద్యుత్ సర ఫరా విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) కొంటె వెంకటనారాయణ అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.

  అనంతరం సీఎండీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో విద్యుత్ పంపిణీలో వివాదాలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ మేరకు విద్యుత్ లోటు ఏర్పడగా, వర్షాభావ పరిస్థితులు తోడు కావడంతో సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, లోటును త గ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.
   
  పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ అవసరం
   
  అందుబాటులో ఉన్న విద్యుత్‌ను వినియోగదారులకు సక్రమంగా అందజేసేందుకు పటిష్టమైన పంపిణీ వ్యవస్థ అవసరమని సీఎండీ వెంకటనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు విద్యుత్ సరఫరాలో సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. కాగా, విద్యుత్ పంపిణీలో 2012-2013లో 13.37 శాతం ఉన్న నష్టాన్ని 2014-2015నాటికి 12.59కి తగ్గించగలిగామని వివరించారు. అంతేకాకుండా పట్టణాల్లో విద్యుత్ సరఫరా మెరుగు పరిచేందుకు 23 సబ్‌స్టేషన్లు నిర్మించామని, మండల కేంద్రాలు, గ్రామాల్లో కొత్తగా 86 సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు.

  1,23,335 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సరఫరా మెరుగు పర్చడం, నష్టాలు తగ్గించాలనే లక్ష్యంతో హెచ్‌వీడీఎస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రూ.8.54 కోట్లతో 322 ఎస్సీ కాలనీలకు, రూ.4.17 కోట్లతో గిరిజన ఆవాస ప్రాంతాలు, నీటివనరులకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు సీఎండీ తెలిపారు. అలాగే, నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌పై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసి 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు.

  నూతనంగా భవనాలు నిర్మించుకునే వారు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేసేలా ప్రోత్సహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ నుంచి మానసిక వికలాంగులకు, కుష్టువ్యాధిగ్రస్తులకు రూ.83 వేల సహాయాన్ని అందించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేసిన సీఎండీ.. శుక్రవారం కార్యాలయంలో నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలను ప్రారంభించారు.

  కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డెరైక్టర్లు బి.వెంకటేశ్వర్‌రావు, టి.చంద్రశేఖర్, ఆర్.జాన్‌ప్రకాశ్‌రావు, జి.సుదర్శన్, సీజీఎంలు ఎండీ.యూనస్, ఎం.వెంకటనారాయణ, కె.ఈశ్వరయ్య, వి.సుధాకర్, జి.రాజారావు, పి.సంధ్యారాణి, టి.సదర్‌లాల్, బి.అశోక్‌కుమార్, జి.రవీంద్రనాథ్, జీఎంలు మధుసూదన్, వి.తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, శివరామకృష్ణ, సాంబయ్య, కె.రమేష్, రాధాకృష్ణంరాజు, ఎస్.రంగారావు, సత్యనారాయణ, వేణుగోపాలాచారి, అచ్చేశ్వర్‌రావు, శివరాం, రవీందర్, కె.కిరణ్, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం, ఈఈలు రవీందర్, ఎస్.అమర్‌నాథ్, ఎస్‌ఈ మోహన్‌రావు, ఛీఫ్ విజిలెన్స్ అధికారి యువీఎస్.రాజు పాల్గొన్నారు.
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా