వంచనకు గురైన యువతికి అండగా ఉంటాం

24 Apr, 2020 11:04 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు నర్సింహ్మ, చిత్రంలో ఆర్డీఓ

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు నర్సింహ

ఇబ్రహీంపట్నం: ప్రేమ పేరుతో వంచనకుగురైన దళిత యువతికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమి షన్‌ సభ్యుడు చిలుకమర్రి నర్సింహ్మ తెలిపారు. ఆ ర్డీఓ అమరేందర్‌రెడ్డి, ఏసీపీ యాదగిరిరెడ్డి సమక్షంలో బాధితురాలు అరుణకు జరిగిన అన్యాయంపై ఇ బ్రహీంపట్నంలో గురువారం విచారణ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచాల మండలం కాగజ్‌ఘాట్‌ గ్రామానికి చెందిన అరుణను అదేగ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్‌గౌడ్‌ ప్రేమించి పెళ్లి చేసుకుని  మాల్‌ గ్రామంలో కాపురం పెట్టినట్లు చెప్పారు.

మూడు నెలలు గడిచిన అనంతరం భార్య అరుణను వదలిపెట్టి పరారయ్యాడని తెలిపారు. భర్త వెంకటేశ్‌ అచూకీ కోసం కాగజ్‌ఘాట్‌లోని అతని ఇంటికి అరుణ వెళ్లగా.. అత్తమామలు, మరిది, మరదలు ఆమెపై దాడిచేశా రని తెలిపారు. బాధితురాలిని మోసగించిన వెంకటేశ్‌ను, అరుణపై దాడిచేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని ఏసీపీ యాదగిరిరెడ్డికి సూచించారు. మోసానికి గురైన దళిత మహిళకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల 25 వేలు అందజేస్తామన్నారు. బాధితురాలికి తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేస్తామని ఆర్డీఓ అమరేందర్‌రెడ్డి తెలిపారు. యు వతిని మోసం చేసిన,  దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలి పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.   

మరిన్ని వార్తలు