అక్టోబర్‌లో ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ నోడల్‌ ఏజెన్సీ సమావేశం

25 Sep, 2017 02:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన నోడల్‌ ఏజెన్సీని సమావేశపర్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు వేగిరం చేసింది. వాస్తవానికి ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకోసారి సమావేశం కావాలి. కానీ మార్గదర్శకాల విడుదలలో జాప్యం కావడంతో సమావేశం ఆలస్యమైంది. అయితే వచ్చే నెల రెండో వారంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్‌ ఏజెన్సీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్‌ తెలిపారు.

2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ కింద 44 ప్రభుత్వ విభాగాలకు రూ.14,350 కోట్లు కేటాయించగా.. ఇందులో ఇప్పటివరకు రూ.4,550 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే నోడల్‌ ఏజెన్సీ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్, వీసీ ఎండీ తదితరులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు