స్కీం పేరిట స్కాం

12 Jul, 2015 03:22 IST|Sakshi
స్కీం పేరిట స్కాం

- పత్తాలేకుండా పోయిన నిర్వాహకుడు
- న్యాయం చేయాలని వేడుకోలు
తట్టుపల్లి(కురవి):
వారానికి ఒక వంద రూపాయలు కట్టాలి... 24 వారాలు కడితే వారానికో బహుమతి.. ప్రతి సభ్యుడికి తప్పనిసరిగా బహుమతి అంటూ ఓ స్కీంను పెట్టి పేదల నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేసి నిర్వాహకుడు ఉడారుుంచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన ఎం.కనకయ్య గత ఏడాది ఫిబ్రవరి నుంచి శ్రీగుంజేడు ముసలమ్మ శ్రీధర్ ఇన్‌స్టాల్‌మెంట్ డ్రా పేరిట లక్కీస్కీం నిర్వహించాడు. 200 మంది సభ్యులకు 200 ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. స్కీంలో చేరిన సభ్యులు వారానికి రూ.100 చొప్పున 24 వారాలు కట్టాలని సూచిం చాడు. స్కీంలో చేరిన సభ్యులు తప్పనిసరిగా మొదటి వారం వాయిదా సొమ్మును ముందుగానే చెల్లించాలి.

వరుసగా రెండు వారాలు సొమ్ము చెల్లించకుంటే సభ్యుడికి డ్రాలో వెళ్లిన బహుమతిని కంపెనీకే చెందుతుందని,  బహుమతి ఇవ్వబడదని నిబంధన పెట్టాడు. వస్తువు కోరుకున్న వారు ముందుగా రూ. 2 వేలు చెల్లిస్తే బహుమతిని ముందుగానే ఇస్తామని బ్రోచర్‌లో నమ్మించాడు. దీంతో మండలంలోని తట్టుపల్లి, కాంపల్లి, కందికొండ, మానుకోట మండలంలోని మాధవపురం గ్రామాలకు చెందిన నిరుపేదలు స్కీంలో చేరారు. వారానికి రూ.వంద చొప్పున ఆరు నెలలు స్కీంలో డబ్బులు చెల్లించారు. అప్పటి నుంచి స్కీంలో ఎవరికి బహుమతి రాలేదని నిర్వాహకుడు నమ్మబలికాడు. సభ్యులు చెల్లించిన రూ.4.80 లక్షలతో ఉడారుంచాడు. బ్రోచర్‌లో ముద్రించిన సెల్ నంబర్‌కు ఫోన్‌చేస్తే సమాధానం రావడంలేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

మరిన్ని వార్తలు