అటెండర్ చేతిలో ‘స్టీరింగ్’

13 Sep, 2014 00:52 IST|Sakshi
అటెండర్ చేతిలో ‘స్టీరింగ్’

ముప్పారం(నిడమనూరు): పాఠశాల బస్సు డ్రైవర్ బాధ్యతారాహిత్యం చిన్నారుల ప్రాణాలమీదకొచ్చింది.. స్టీరింగ్ అటెండర్‌కు ఇవ్వడం తో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిడమనూరు మండలం ముప్పారం గ్రామ శివారులో శుక్రవారం చో టు చేసుకుంది. వివరాలు.. నిడమనూరుకు చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు రోజు మాదిరిగా మండల పరిధిలోని ఆ యా గ్రామాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చేందుకు బయలుదేరింది.
 
వేంపాడ్, జీ అన్నారం గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని ముప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి గాతులోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో అన్నారం, వేంపాడ్ గ్రామాలకు చెందిన విద్యార్థులు చిమట నందకుమార్, చిమట కోటేష్, బింత కావ్యసుధ, వల్లపు అరవింద్‌లకు తీవ్ర, అక్షయ, వేణు, నందిని, మణిదీప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిం చారు. ప్రమాద సమయంలో చిన్నారు లు తీవ్రంగా రోదించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ముప్పా రం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఆలంపల్లి వెంకన్నలు నిడమనూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ విద్యార్థులకు ప్రథమ చికిత్స చేయించి మిర్యాలగూడకు తీసుకెళ్లారు.
 
అటెండర్ బస్సు తోలడంతోనే..
స్కూల్ బస్సును అటెండర్ తోలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు తెలిపారు. బస్ రెండవ ట్రి ప్పుకని వేంపాడ్, అన్నారం గ్రామాలకు చెందిన 21మంది విద్యార్థులను తీసుకుని వస్తుండగా గుంటిపల్లి సమీపంలో డ్రైవర్ మహేష్ పండ్లు తోమడానికి వేపపుల్ల కోసం దిగాడు. ఆ సమయంలో డ్రైవర్ స్థానంలోకి స్కూల్, బస్‌కు అటెం డర్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్ వచ్చాడు.

అక్కడి నుంచి కదిలిన 10నిమిషాలలోపే ప్రమాదం జరిగింది. ప్రతి రోజు అదే ప్రాంతంలో డ్రైవర్ దిగడం, అటెండర్ రావడం జరుగుతుందని బస్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ వేంపాడ్‌కు చెందిన కార్తీక్ తెలి పాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్,అటెండర్ పరారయ్యారు. గాయపడిన పిల్లల తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు.

మరిన్ని వార్తలు