అరరే ! ప్లాన్‌ బెడిసి కొట్టిందే..

4 Aug, 2019 10:39 IST|Sakshi
విద్యార్థినితో మాట్లాడుతున్న ఎస్సై మురళీధర్‌

బయ్యారం : హాస్టల్‌ నుంచి తప్పించుకోవటమే గాకుండా తన మాటలతో పలువురిని బురిడి కొట్టిద్దామనుకున్న ఓ విద్యార్థిని చివరకు తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకుల చెంతకు చేరింది. ఈ ఘటన శనివారం బయ్యారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఏకలవ్య రెసిడెన్షీయల్‌ పాఠశాలలో మరిపెడ మండలం అబ్బాయిపాలెంకు చెందిన మానపాటి మల్లయ్య తన కుమార్తె భానును ఐదవతరగతిలో ఇటీవల జాయిన్‌ చేశారు.

అయితే తల్లిదండ్రులను వదిలి పాఠశాలలో ఉండేందుకు ఇబ్బంది పడిన భాను ఉదయం పాఠశాల గేటు నుంచి టీచర్ల కండ్లుగప్పి బయటకు వచ్చి పరుగున గాంధీసెంటర్‌కు చేరుకుంది. ఇంతలో అటు వైపు నుంచి బస్టాండ్‌ సెంటర్‌కు వెళ్తున్న ఆటోను ఆపిన భాను అబ్బాయిపాలెం వెళ్లాలని డ్రైవర్‌కు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్‌ బస్టాండ్‌ సెంటర్‌లో ఆటో నుంచి దింపాడు. తనను శుక్రవారం నలుగురు వ్యక్తులు కారులో బయ్యారం తీసుకొచ్చారని, తాను వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు బురిడి కొట్టించడానికి ప్రయత్నించింది.

దీంతో ఆ బాలిక చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన స్థానిక ఆటోడ్రైవర్లు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో బాలికకు ఎస్సై మురళీధర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి వివరాలు అడుగగా తాను పాఠశాలలో ఉండేందుకు ఇష్టం లేక ఇంటికి వెళ్లేందుకు వచ్చానని అసలు విషయం తెలిపింది. దీంతో ఎస్సై బాలిక తల్లిదండ్రులతో పాటు పాఠశాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. మొత్తానికి సినీ ఫక్కిలో చిన్నారి చెప్పిన కథ  స్థానికులను ఆందోళనకు గురిచేసినా ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కులగణన తప్పుల తడక

రైలు నుంచి జారిపడి జవాన్‌ మృతి 

గోదావరి వరద పోటు..

కోడిపెట్ట.. రెండు గుడ్లెట్టా? 

వైద్య సేవలో.. మెదక్‌ సెకండ్‌

'పోలీస్‌ కావాలనుకొని ఎమ్మెల్యేనయ్యాను'

వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..

స్నేహితులున్నవారు జీవితంలో ఓడిపోరు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

చేప విత్తనాలు.. కోటి 

నిజామాబాద్‌ వాసికి రూ. 28.4 కోట్ల లాటరీ

కీలక సాక్ష్యం.. ‘మరణవాంగ్మూలం’

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

గోదారి గంగ.. ఉరకలెత్తంగ

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

ఉందిలే మంచి కాలం..! 

‘షీ నీడ్‌’ మంచి ఆలోచన

మన విద్యార్థులు పదిలం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భార్యాభర్తల వివాద కేసుల విచారణ 

60 రోజుల ప్రణాళికతో..

ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌కు బ్రేక్‌! 

భారీగా ఆహారశుద్ధి పరిశ్రమలు

‘పరపతి’ పోయింది!

దేవదాస్‌ కనకాలకు కన్నీటి వీడ్కోలు

గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాజీనామా

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌