12 నుంచి బడి

25 May, 2019 01:17 IST|Sakshi

ఎండ తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపు

సీఎం ఆదేశాల మేరకు విద్యా శాఖ నిర్ణయం 

బడిబాటపై రాని స్పష్టత 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేసవి సెలవులు ముగించుకొని వచ్చే నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్య అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 1 నుంచే బడులు ప్రారంభం కావాల్సి ఉంది. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్‌ 11 వరకు బడులకు సెలవులు పొడిగించాలని, 12 నుంచి బడులు తిరిగి ప్రారంభించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విద్యా శాఖ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూన్‌ 4 నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట ఉన్నట్లా.. లేనట్లా అన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి జూన్‌ 1న బడులు ప్రారంభమవుతాయి కాబట్టి టీచర్లంతా 1 నుంచి 3 వరకు బడి బాట కార్యక్రమాలకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, 4 నుంచి బడిబాటను నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పాఠశాలల పునఃప్రారంభం తేదీని 12కు వాయిదా వేయడంతో బడిబాటపై టీచర్లు ఆలోచనలో పడ్డారు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం బడులకు సెలవులను పొడిగించిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులు టీచర్లకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నాయి. 

సమీక్షించి నిర్ణయిస్తాం: పాఠశాల విద్య కమిషనర్‌ 
పాఠశాలల పునఃప్రారంభ తేదీని ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో బడిబాట విషయంలో సమీక్షించి నిర్ణయిస్తామని పాఠశాల విద్య కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 4 నుంచి నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

మూతపడుతున్న ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

వయసు 20.. బరువు 80..

మహిళలను వేధిస్తే ఊర్లో ఉండనివ్వం..

సరిహద్దుల్లో చేతివాటం!

పార్టీని మీరే కాపాడాలి : సోనియా

2,166 మందిపై అనర్హత వేటు

ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా..

డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

ఆమెకు రక్ష

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

ఉగ్రవాదంపై ‘వర్చువల్‌’ పోరు!

నేటి నుంచి అసెంబ్లీ 

అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా? 

నల్లమలలో అణు అలజడి!

కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత

‘వ్యవసాయానికి 5 శాతం కేటాయింపులా’

సిటీకి దూపైతాంది

‘ఐ లవ్‌ మై జాబ్‌’ 

ఎలక్ట్రిక్‌ బస్సు సిటీ గడప దాటదా?

24 నుంచి ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత