పాఠశాలలో కొట్టుకున్న ఉపాధ్యాయులు

22 Nov, 2017 11:14 IST|Sakshi

భోజనం ప్లేట్లు ఇంటికి తీసుకెళ్లడంతో వివాదం

విషయం తెలియడంతో ఘర్షణ

హన్వాడ(మహబూబ్‌నగర్‌): విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలని ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బాహాబాహీకి దిగిన వైనమిది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నత పాఠశాలలో పనిచేసే హిందీ పండిట్‌ నాగేష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు చంద్యానాయక్, గణితం టీచర్‌ హన్మంతునాయక్, ఇంగ్లిష్‌ టీచర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలలోనే వ్యక్తిగతంగా భోజనం తయారు చేయించుకునేవారు. ఇందుకోసం సొంతంగా సరుకులు తెచ్చుకోవడంతో పాటు ఎలక్ట్రిక్‌ స్టౌ కూడా సమకూర్చున్నారు.

కొన్నాళ్లు ఇది బాగానే సాగిన బి య్యం, సరుకులు అయిపోవడంతో గొడవలు మొదల య్యాయి. ప్లేట్లు, ఇతర సామాగ్రిని తోటి వారికి తెలియ కుండా హిందీ పండిట్‌ నాగేష్‌ ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన మిగతా ఉపాద్యాయులు నాగేష్‌ను నిలదీశారు. ఆ తర్వాత నాగేష్‌ మిగతా వారితో కలిసేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఇంతలో నాగేష్‌ వారు వం డుకునే ఎలక్ట్రిక్‌ స్టౌను పగలగొట్టాడు. విషయం తెలి యడంతో మిగతా ముగ్గురు ఆయనను ప్రశ్నించారు. ఈక్రమంలో మంగళవారం చంద్యానాయక్‌.. నాగేష్‌పై దాడి చేయడంతో గొడవ పెద్దదైంది. దీంతో మిగతా ఉపాధ్యాయులు సర్దిచెప్పారు.

వ్యక్తిగత గొడవలే..
ఉపాధ్యాయులు నాగేష్, చంద్యానాయక్‌ ఒకే కాలనీలో ఉంటుండగా.. చంద్యానాయక్‌ తన ఇంటి నిర్మాణం కో సం బేస్‌మెంట్‌ రాయిని నాగేష్‌ నుంచి తీసుకున్నాడని హెచ్‌ఎం విజయరామరాజు తెలిపారు. దీనికి సంబంధిం చి డబ్బు విషయమై గొడవ జరగగా కొట్టుకున్నారని చె ప్పారు. ఎంఈఓ రాజునాయక్‌ మాట్లాడుతూ ఉపాధ్యా యులిద్దరూ వ్యక్తిగత గొడవతో కొట్టుకున్నారని తెలిపా రు. విషయాన్ని డీఈఓకు తెలియజేశామని చెప్పారు.

మరిన్ని వార్తలు