పంద్రాగస్టుకైనా అందేనా?

12 Aug, 2019 13:16 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలలకు అందని ఏకరూప దుస్తులు

నెలలు గడుస్తున్నా పాఠశాలలకు చేరని వైనం 

కూలి గిట్టుబాటు కాక  ఆగిన వస్త్రం 

సాక్షి, ఆసిఫాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యాప్రమాణాల పెంపుదలకు కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా యి. కానీ అందుకు సరైన ప్రణాళిక లేకపోవడం తో అనుకున్న లక్ష్యం నీరుగారిపోతోంది. పాఠ శాలల ప్రారంభంలోనే విద్యార్థులకు అందజే యాల్సిన ఏకరూప దుస్తులు పాఠశాలలు ప్రా రంభమై రెండునెలలు గడుస్తున్నా ఇప్పటికీ అం దకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

పంద్రాగస్టుకైనా అందేనా? 
సర్వశిక్షా అభియాన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంలు అందజేస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏకరూప దుస్తులు పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయా పాఠశాలలకు అందలేదు. దీంతో విద్యార్థులు మాకు జెండా పండుగకు కొత్త బట్టలు కుట్టించమని ఇంటివద్ద మారాం చేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువశాతం పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో వారికి కొత్తబట్టలు కుట్టించుకునే ఆర్థికస్థోమత లేక ప్రభుత్వం సరఫరా చేసే యూనిఫాం కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం పంద్రాగస్టుకైనా మా పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ యూనిఫామ్‌ ఇంకా సిద్ధం కాక పోవడంతో విద్యార్థుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.

జిల్లాలో ఇది పరిస్థితి.. 
జిల్లాలోని 15 మండలాల్లో అన్ని ప్రభుత్వ లోకల్‌ బాడి యాజమాన్యాలలో మొత్తం 722 పాఠశాలలు  ఉన్నాయి. వాటిలో ప్రాథమిక పాఠశాలలు 560, ప్రాథమికోన్నత పాఠశాలలు 104, ఉన్నత పాఠశాలలు 58 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 61,629 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారందరికీ ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు ప్రభుత్వం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా వస్త్రాన్ని ఆయా మండలాలకు పంపిణీ చేసింది. కానీ విద్యార్థుల కొలతలు తీసుకుని వాటిని కుట్టించి ఇచ్చే బాధ్యతను ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీలకు అప్పగించింది.

కుట్టుకూలితోనే సమస్య 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలబాలికలకు యూనిఫామ్‌ కోసం అధికారులు వస్త్రాన్ని పంపిణీ చేశారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు బాలబాలికలకు కొలతలు తీసుకుని కుట్టించి ఇచ్చే బాధ్యతను ఎస్‌ఎంసీలకు అప్పగించారు. 1 నుంచి 7వ తరగతి వరకు షర్ట్‌నిక్కర్, 8వ తరగతి నుంచి పదోతరగతి షర్ట్, పాయిట్‌ బాలుర కోసం కుట్టించి ఇవ్వాలి. టైలర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఒకజత కుట్టుకూలి రూ.50 సరిపోకపోవడంతో ముందుకు రావడం లేదు. కొన్ని ఏజెన్సీలు ముందుకు వచ్చినప్పటికీ వారికి వీలైనప్పుడు పాఠశాలలకు డ్రెస్‌లు పంపిస్తున్నారు. మరికొందరు రూ.50లకు షర్టు, పాయింట్‌ గిట్టుబాటు అవడం లేదని తిరిగి ఇచ్చేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో యూనిఫాం తయారుకాక పంపిణీకి నోచుకోవడంలేదు. కనీసం 8నుంచి పదోతరగతి విద్యార్థుల డ్రెస్‌కు రూ.70 నుంచి రూ.80 అందిస్తే కూలి పడుతుందని టైలర్లు పేర్కొంటున్నారు.

బిల్లుల చెల్లింపులో ఆలస్యం 
గతేడాది కుట్టిన యూనిఫాంలకు టైలర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావడంతో ఈఎడాది ముందుకు రావడం లేదు. ఇచ్చే అతి తక్కువ కూలికి అధికారుల చుట్టూ తిరగడంకంటే కుట్టకుండా ఉంటేనే మేలంటున్నారు. దానికి తోడు మండలాలకు పూర్తిస్థాయి ఎంఈవోలు లేకపోవడం, ఒక్కో ఎంఈవోకు రెండు నుంచి నాలుగు మండలాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ లోపించి పనులు కుంటుపడుతున్నాయి. పంద్రాగస్టులోగా కొత్త డ్రెస్‌లు  అందుతాయో లేదోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

పంద్రాగస్టులోగా అందిస్తాం 
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కోసం క్లాత్‌ పంపిణీ చేశాం. ప్రభుత్వం ఒక్కో డ్రెస్‌కు చెల్లించే మొత్తం తక్కువనే ఉద్దేశంతో దర్జీలు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలో పూర్తి అయ్యాయి. మిగితా పాఠశాలలకు పంద్రాగస్టు వరకు పూర్తిస్థాయిలో  అందించాలని ఎంఈవో, హెచ్‌ఎంలకు సూచించాం. – భిక్షపతి, డీఈవో  

మరిన్ని వార్తలు