జైళ్ల శాఖకు స్కోచ్‌ స్మార్ట్‌ అవార్డు

22 Sep, 2017 00:29 IST|Sakshi
జైళ్ల శాఖకు స్కోచ్‌ స్మార్ట్‌ అవార్డు

ఈ–ములాఖత్, ఈ–మేనేజ్‌మెంట్‌తో గుర్తింపు

హైదరాబాద్‌: రాష్ట్ర జైళ్ల శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఖైదీలు, వారి కుటుంబీకులతో మాట్లాడుకునేలా కల్పించిన ఈ–ములాఖత్, ఈ–ప్రిజన్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమానికి స్కోచ్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ ఓ ప్రకటనలో ఆనందం వ్యక్తంచేశారు. అదే విధంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మై–నేషన్‌ ఆయుర్వేద వైద్యశాలకు ప్రభుత్వ గుర్తింపు లభించిందని ఆయన తెలిపారు.

ఈ నెల 16న జీవో నంబర్‌ 169తో ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఆయుర్వేద చికిత్సకు సంబంధించి వైద్యులు తమ వైద్యశాలకు పంపించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి కుటుంబీకులు రీయింబర్స్‌మెంట్‌ కింద వైద్యసేవలు పొందవచ్చని వీకే సింగ్‌ వెల్లడించారు. కేరళ నుంచి ప్రత్యేక ఆయుర్వేద వైద్య నిపుణులు తమ వద్ద అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు