ట్రిపుల్‌ఐటీలో పెరగనున్న సీట్లు!

24 Apr, 2018 10:32 IST|Sakshi
ట్రిపుల్‌ఐటీ కళాశాల ముఖద్వారం

బాసర(ముథోల్‌): బాసర ట్రిపుల్‌ ఐటీలో 2018–19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 500 సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2008లో 2000 మంది విద్యార్థులతో బాసర ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో 2వేల సీట్ల నుంచి వెయ్యి సీట్లకు కుదించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు పలుసార్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో 6వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆరేళ్లు విద్యాభ్యాసం పూర్తి చేసిన వందలాదిమందికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కొలువులు సాధించారు. ప్రస్తుతం 500 సీట్లు పెరగనుండడంతో గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగనుంది. సీట్ల పెంపు సమాచారంపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణ విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు