భద్రత పూజ్యం దొంగలదే రాజ్యం

19 Dec, 2014 16:15 IST|Sakshi
భద్రత పూజ్యం దొంగలదే రాజ్యం
  • రైళ్లలో పెరిగిన చోరీలు.. పట్టుబడని దొంగలు
  • సికింద్రాబాద్ పరిధిలో చోరీల విలువ రూ.2.45 కోట్లు
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసు జిల్లాలో ఈ  ఏడాది నవంబర్ నాటికి రైళ్లు, పట్టాలపైన జరిగిన  దొంగతనాల్లో రూ. 2కోట్ల 45 లక్షల ఆస్తి చోరుల పాలైంది. గత సంవత్సరంతో  పోలిస్తే ఈసారి చోరీ విలువ మరో 20 లక్షలు పెరిగింది.  ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు గుంతకల్, విజయవాడ రైల్వే ఎస్పీ జిల్లాలు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే పోలీసు జిల్లా పరిధి మిగిలింది.

    దీనికింద  మొత్తం మూడు సబ్ డివిజన్లు సికింద్రాబాద్ అర్బన్, సికింద్రాబాద్ రూరల్, కాజీపేట్‌లున్నాయి. గత జనవరి నుంచి  నవంబర్ వరకు నడుస్తున్న ైరైళ్లలోకి ప్రవేశించి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను తెంచుకుపోవడం, నిద్రలో ఉన్న ప్రయాణికుల లగేజ్‌ను ఎత్తుకుపోవడం  వంటివి అనేకం జరిగాయి.

    గత 11 నెలల్లో  రైళ్లలో 695 చోరీలతోపాటు మొత్తం 777 కేసులు నమోదయ్యా యి. ఈ కేసుల్లో అపహరణకు గురైన సొత్తు విలువ రూ.2.45 కోట్లని పోలీసులు తేల్చా రు.  కాగా  పలువురు దొంగలను పట్టుకున్నప్పటికీ వారి నుంచి స్వాధీనం చేసుకుంది రూ.42 లక్షల 6 వేలే. కాగా నింది తుల కోసం ప్రత్యేకబృందాలతో గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
     

మరిన్ని వార్తలు