అందుబాటులో విత్తనాలు, ఎరువులు: పోచారం

8 Jul, 2018 01:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాధార పంటల సాగు ఆశాజనకంగానే ఉందని, ప్రాజెక్టులు, చెరువుల్లోకి ఇంకా నీరు రానందున వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంటుందన్నారు. వ్యవసాయ యాం త్రీకరణకు ఈ ఏడాది అధిక నిధులను కేటాయించామని, విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోతల వరకు అన్ని పనులు యంత్రాలతోనే జరి గేలా చూడాలని మంత్రి సూచించారు. యం త్రాల ద్వారా సాగు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను కూడా అధిగమించ వచ్చన్నారు.

ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏఈఓ) నియమించినట్లు చెప్పారు. ప్రతి క్లస్టర్‌లో సాగుకు అవసరమైన యంత్రాల వివరాలను అధికారులు రూపొందించాలన్నారు. రైతు వేదికల నిర్మాణం వేగం పుంజుకోవాలని అధికారులను ఆదేశించారు.  సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్‌ ఎం.జగన్‌మోహన్,  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పతులా.. సతులా..!

బాల్యం.. వారికి మానని గాయం

సాయానికి వెళ్తే.. ప్రాణం పోయింది

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..

కారు గుర్తు నాదే.. కాదు.. నాదే!

వివాహేతర  సంబంధానికి  అడ్డుగా ఉన్నాడని..

ఓలా.. లీజు గోల

పెట్రోల్‌లో నీళ్లు..

ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి

గ్రామాలకు అమెరికా వైద్యం

ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు

సాయంత్రమూ సాఫ్‌

గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం

నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

మండలానికో డెయిరీ పార్లర్‌

చింతమడకలో సీఎం సార్‌ మెనూ..

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌!

ఉన్నారా.. లేరా? 

‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!

ఉద్యోగాలు కోరుతూ వినతిపత్రాలివ్వొద్దు..

పాములకు పాలు పట్టించడం జంతుహింసే!

జాతీయ రహదారులకు నిధులివ్వండి 

26 నుంచి రాష్ట్ర వాసుల హజ్‌ యాత్ర 

40% ఉంటే కొలువులు

యథావిధిగా గ్రూప్‌–2 ఇంటర్వ్యూలు

‘కళ్లు’గప్పలేరు!

సకల హంగుల పట్టణాలు! 

పోటెత్తిన గుండెకు అండగా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా