రాష్ట్రంలో సీమాంధ్రుల పాలనే సాగుతోంది

7 Aug, 2018 14:12 IST|Sakshi
పాదయాత్రను ప్రారంభిస్తున్న దిలీప్‌కుమార్‌

సూర్యాపేట : రాష్ట్రంలో సీమాంధ్రుల పాలనే కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకుడు కపిలవాయి దిలీప్‌కుమార్‌ విమర్శించారు. సోమవారం పట్టణంలోని రైతుబజారు వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద స్వచ్ఛ రాజకీయాలు, నియోజకవర్గ సమాగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జనసమితి జిల్లా ఇన్‌చార్జి కుంట్ల ధర్మార్జున్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ చిత్రపటానికి, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలన్నా రు. ప్రస్తుతం నాయకులు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ సంస్కృతిని ధ్వంసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పోయి కాంట్రాక్టర్లే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చకుండా ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు చేపడితే లాభం ఉండదన్నారు.  జయశంకర్‌ ఆశయ సాధన కోసం ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణ జనసమితిని స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇంచార్జి ధ ర్మార్జున్‌ మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో ప్రభుత్వం కమీషన్లు దండుకుంటూ అభివృద్ధి జరుగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

కార్యక్రమంలో చెలమారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్‌ రమాశంకర్,  మల్లయ్య,  యాదగిరి, పందిరి నాగిరెడ్డి, రాజమల్లయ్య, పరీక్షన్, అంజయ్య,  కృష్ణారెడ్డి, మట్టన్న, నారబోయిన కిరణ్‌కుమార్,  అశోక్‌కుమార్,  శంకర్,  మహేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు