తమ్ముడూ సెలైంట్!

1 Jan, 2015 04:34 IST|Sakshi
  • క్యాడర్ లేని టీటీడీపీ
  •  గ్రామ స్థాయి నుంచి బలోపేతం కష్టమే..
  •  ఇప్పుడే ప్రజా ఉద్యమాలొద్దు
  •  మూడేళ్ల తర్వాతే ప్రజల్లోకెళ్లండి
  •  జిల్లా నాయకులకు చంద్రబాబు సూచన
  •  అప్పుడైనా ప్రజలు నమ్ముతారా?
  •  ఆలోచనలోపడ్డ పార్టీ శ్రేణులు
  • సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఉనికి కోల్పోయిన టీడీపీ మూడేళ్ల తర్వాతే ప్రజల ముందుకు రావాలని నిర్ణయించింది. ముందుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని భావించినా.. క్యాడర్ లేక.. ప్రజల స హకారం లేక కార్యక్రమాలన్నీ విఫలమై పార్టీ పరువుపోతుందని అధిష్టానం భావించింది. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్లొద్దని టీడీపీ భావిస్తోంది. ముందుగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు క్యాడర్‌ను బలోపేతం చేసుకుని.. ఆ తర్వాతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఆ పార్టీ అధినేత చం ద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా నాయకులకు సూచించి నట్లు సమాచారం.

    ఈ క్రమంలో ఇటీవల ‘సైకిల్’ ఎక్కిన బో డ జనార్దన్ ముందుగా క్యాడర్‌ను బలోపేతం చేసుకునే పని లో పడ్డారు. కానీ.. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు లేకపోవడంతో వారిని ఎలా ప్రసన్నం చేసుకోవా లో తెలియక ‘దేశం’ నేతలు మార్గాలు అన్వేషిస్తున్నారు. సా ర్వత్రిక ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండాపోయిన టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఇప్పటికే ఇత ర పార్టీలకు వలస వెళ్లిపోయారు. దీంతో పార్టీ క్యాడర్ పూర్తి గా బలహీనపడింది.

    మిగిలిన  పార్టీ శ్రేణులూ ప్రజల్లో వెళ్లేం దుకు సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా ఆ పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్నివ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లే నందునా.. మూడేళ్లలో పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసి ఎన్నికల ముందు మళ్లీ ప్రజల్లో వెళ్లాలని నిర్ణయించింది.
     
    నమ్మకం కలిగించేదెలా..?


    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న.. రా ష్ట్ర ఏర్పాటు తర్వాతా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీ రు, విద్యుత్ వాటాను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం ఎలా కలిగించాలి..? పార్టీని ఎ లా బలోపేతం చేయాలో తెలియక జిల్లా నాయకత్వం ఆలోచనలో పడింది. బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని గమనించి.. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ఘోరంగా ఓడించిన ప్రజలు.. ఇకపై కూడా బాబును నమ్మొద్దని నిర్ణయించుకున్నారు.

    ఇదే క్రమంలో గత నెలలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదులో ‘ప్రమాద బీమా’, ‘ఆరోగ్య బీమా’ ఆఫర్లు ప్రకటించినా ఎవరూ విశ్వసించలేదు. దీంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘోరంగా విఫలమైంది. అధిష్టానం ఊహిస్తున్నట్లుగా క్యాడ ర్ కొద్దోగొప్పో బలోపేతమైనా ఆ సమయంలో పార్టీ చేపట్టే ఆందోళనలో ప్రజలు భాగస్వాములవుతారో లేరోనని ఇప్పట్నుంచే ఆ పార్టీ నాయకులకు ఆందోళన పట్టుకుంది.
     

మరిన్ని వార్తలు