చంద్రయాన్‌–2 ల్యాండింగ్‌ను చూసే అవకాశం

10 Aug, 2019 11:46 IST|Sakshi

జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి

సాక్షి, మెదక్‌: చంద్రయాన్‌–2 ల్యాండింగ్‌ను ప్రధానమంత్రితో కలిసి చూసే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇస్రో బెంగళూర్‌ వాళ్లు ఆన్‌లైన్‌ క్విజ్‌ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. mygov.in వెబ్‌సైట్‌లో  10 నుంచి 20వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించే క్విజ్‌లో ఆసక్తి కలిగిన విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు.

ఇందులో 20 ప్రశ్నలకు 10 నిమిషాల వ్యవధిలో సమాధానాలు తెలపాలని సూచించారు. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం తెలిపిన ఇద్దరు విద్యార్థులను ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరితో కలిసి ప్రధానమంత్రి ఇస్రో బెంగళూరు కేంద్రం నుంచి చంద్రయాన్‌–2 ల్యాండింగ్‌ను వీక్షించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్రం తరఫున మన జిల్లాకు దక్కే విధంగా ఎక్కువ మంది క్విజ్‌లో పాల్గొనాలని తెలిపారు.  విద్యార్థులను ప్రధానోపాధ్యాయు లు ప్రోత్సహించాలని కోరారు.  

మరిన్ని వార్తలు