కవ్వించి.. కారెక్కి

7 Sep, 2014 01:03 IST|Sakshi
కవ్వించి.. కారెక్కి

బంజారాహిల్స్: జీన్స్‌ప్యాంటు.. టీషర్ట్.. ఖరీదైన చెప్పులు.. హై టెక్ స్టైల్..జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ యువతి సన్నగా నవ్వుతూ లిఫ్ట్ అడిగింది. మాదాపూర్ నుంచి బెంట్లీ కారు లో వస్తున్న యువకుడు కారు ఆపి లిఫ్ట్ ఇచ్చా డు. కానీ కారు ఎక్కింది అందమైన యువతి కాదని హిజ్రా అని తేలింది.

వివరాలు.. ముం బయికి చెందిన సీమ అందమైన లేడీ గెటప్‌లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రాత్రి సమయాల్లో తిరుగుతూ ఖరీదైన కార్లలో వచ్చే వారిని లిఫ్ట్ అడిగి అందిన కాడికి దోచుకుంటుంది. శుక్రవారం రాత్రి మాదాపూర్ వైపు నుంచి వస్తున్న యువకుడ్ని లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నాడు.

మాటల్లోపెట్టి ఆ యువకుడి బంగారు గొలుసును, జేబులోని పర్సు ను తన బ్యాగ్‌లో వేసుకుంది. కొద్ది దూరం వెళ్లగానే డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న ప్రాం తంలో పోలీసులను చూసి సీమ కారు దూకి పారిపోయేందుకు యత్నించింది. అప్పటికే మెడలో గొలుసు లేదని చూసుకున్న ఆ యువకుడు దొంగ దొంగ అంటూ అరిచాడు.
 
పోలీసులు అప్రమత్తమై పారిపోతున్న యువతిని వెంబడించారు.  నేరుగా వెళ్లి జూబ్లీహిల్స్ గుట్టలో దాక్కుంది. టార్చ్‌లైట్లతో పోలీసులు గంట పాటు గాలించగా రాళ్లల్లో ఓ మూలన నక్కి కూర్చొంది. ఆమెను ఎవరంటూ ప్రశ్నించగా ముసుగు తొలగించి పేరుచెప్పగానే అంతా అవాక్కయ్యారు. ఆమె కాదని హిజ్రా అని తెలుసుకొని నోళ్లు వెల్లబెట్టారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు