ప్రజా సేవకే అంకితం

12 Nov, 2018 08:36 IST|Sakshi
మాట్లాడుతున్న గంగుల కమలాకర్‌

 ఆశీర్వదించి గెలిపించండి

 తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కొత్తపల్లి: చివరి రక్తపు బొట్టు వరకు ప్రజా సేవకే అంకితమవుతానని తాజా మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కొత్తపల్లి మండలం బావుపేటలో ఆదివారం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మార్కెండేయుడి దయతో మళ్లీ విజయం సాధించి ప్రజలకు సేవ చేస్తానని, నమ్మిన ప్రజల వెంటే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకొంటానని హామీ ఇచ్చారు. కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన తనను 20 ఏళ్లుగా ప్రజలు ఆశీర్వదిస్తూనే ఉన్నారంటే తన ప్రజలకు చేస్తున్న సేవనేనన్నారు. 

ప్రజలకు ప్రజా సేవకుడిగానే ఉంటానని.. కాని తప్పు చేయనని, ఒకవేళ తప్పు చేయాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గంగుల స్పష్టం చేశారు. సంఘం నాయకుడు గాలిపెల్లి రవీందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ సర్పంచ్‌ దావ వాణి కమల మనోహర్, ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్, పద్మశాలీ సంఘం నాయకులు శ్రీనివాస్, సిరికొండ రవీందర్, భానుప్రకాష్, మహేందర్, కరుణాకర్‌ పాల్గొన్నారు. 

కమాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచారం...
మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు మద్దతుగా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. నాయకులు బోనాల రాజేశం, ఆరె అనిల్‌కుమార్, కుంట రాజిరెడ్డి, బోనాల మునీందర్, గడ్డి రాజు, కుంట హరీశ్‌కుమార్, పట్టెం గంగయ్య, బూస రాజయ్య, జగన్, తిరుపతి పాల్గొన్నారు.   

టీఆర్‌ఎస్‌లో చేరిక...
నగరంలోని 48వ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు పిట్టల మధుసూదన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో గుర్తింపు లేనందున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నాని మధుసూదన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌లు పాల్గొన్నారు.  

45వ డివిజన్‌లో ఇంటింటా ప్రచారం
కరీంనగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని టీఆర్‌ఎస్‌ నాయకుడు కర్రె రాజు ఆధ్వర్యంలో 45వ డివిజన్‌ జ్యోతినగర్‌లో ఆదివారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రచారానికి ముందు గంగుల కమలాకర్‌ గెలువాలని సంతోషిమాతా, హనుమాన్‌ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. నాయకులు కర్రె పద్మ, కర్రె లావణ్య, అంజలి, దేవిక, కొలెం కొమురయ్య, బండారి కొమురయ్య, గడ్డల వీరేశం, బైర అశోక్, కర్రె బీరయ్య, మల్లేషంలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు