సీపీఎం సీనియర్‌  నాయకుడు మృతి 

12 Nov, 2018 17:06 IST|Sakshi

పాల్గొన్న సీపీఎం నాయకులు 

పాల్వంచ: సీపీఎం సీనియర్‌ నాయకుడు గుండ్ల దైవాదీనం (92) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక రాహుల్‌గాంధీనగర్‌లో గల స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. దైవాదీనం సీపీఎం అనుబంధ రైతు సంఘం రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నారు. సీపీఎం నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. దైవాదీనానికి భార్య తులశమ్మ, నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు కొడుకులు గతంలోనే మృతి చెందగా.. ప్రస్తుతం కొడుకు వెంకటేశ్వర్లు ఉన్నారు.

దైవాదీనం మృతదేహాన్ని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, బి.వెంకట్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, కొండపల్లి శ్రీధర్, దొడ్డా రవి, గూడెపూడి రాజు, మానస అకాడమీ డైరెక్టర్‌ టి.ప్రభుకుమార్, సీపీఐ జిల్లా సమితి నాయకులు ముత్యాల విశ్వనాథం, పట్టణ, మండల కార్యదర్శులు కొమ్మవరపు ఆదాం, ముత్యాల వెంకటేశ్వర్లు, వి.పూర్ణచందర్‌రావు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు జ్యోతుల రమేష్, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లెల రవిచంద్రతోపాటు పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు