పోలీసులపైనా ఫిర్యాదు చేయొచ్చు! 

7 Sep, 2019 03:38 IST|Sakshi

‘హ్యాక్‌ ఐ’ యాప్‌లో ప్రత్యేక కాలమ్‌ 

పారదర్శకతే లక్ష్యంగా అందుబాటులోకి 

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా నేరం, అన్యాయం జరిగితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాం.. మరి ఆ పోలీసుతోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే.. ఉన్నతాధికారులను కలవాలి. కానీ అందుకు చాలా సమయం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ప్రజలను ఇబ్బందులు పెట్టే ఖాకీలపై ఉన్నతాధికారులకు ఇట్టే ఫిర్యాదు చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో హ్యాక్‌ ఐ యాప్‌ ఉంటే చాలు ఈ పని క్షణాల్లో చేసేయొచ్చు. కొంతకాలంగా పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో పాత పోస్టులు, ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో ఫలానా పోలీసు తమ సమస్యను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారన్న వార్తలూ వస్తున్నాయి. అందులో నిజానిజాలు తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. 

‘వయొలేషన్‌ బై పోలీస్‌’లో ఫిర్యాదు 
దుష్ప్రచారాల నివారణ, అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోలీసులపై ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పోలీసు శాఖలో పూర్తి పారదర్శకత కోసం ‘హ్యాక్‌ ఐ’లో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చారు. వయొలేషన్‌ బై పోలీస్‌.. అనే ఆప్షన్‌ను పొందుపరిచారు. ప్రజల నుంచి ఫిర్యాదు తీసుకోకపోయినా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు తిరస్కరించినా, దురుసుగా ప్రవర్తించినా, ప్రతిఫలం ఆశించినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఏకపక్షంగా వ్యవహరించినా, సరిగా స్పందించకున్నా, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు.. తదితర విషయాలపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.

ఎక్కడ జరిగిందో చెబుతూ ఫొటోలు, వీడియోలు సహా ఆధారాలు జత చేయొచ్చు. ఇది నేరుగా ఉన్నతాధికారులకే చేరుతుంది కాబట్టి.. నిమిషాల్లో బాధితుల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో తప్పుడు ప్రచారాలకు తెరపడుతుందని పోలీస్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మండపాల్లో కేసీఆర్‌ బొమ్మ చెక్కడంపై నిరసన

టీఆర్‌ఎస్‌లో కలకలం!

ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి 

మార్క్‌ఫెడ్‌ అప్పు.. రూ. 1,827 కోట్లు

పిల్లలపైనే డెంగీ పడగ!

బల్దియా.. జల్దీయా?

ఊరికి యూరియా

పట్టాలెక్కిన పల్లె ప్రణాళిక 

నిమ్స్‌లో ఇకపై మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ సేవలు 

12న గణేష్‌ శోభాయాత్ర

భద్రం కాదు.. ఛిద్రం

స్తంభాలపై కేసీఆర్‌ చిహ్నాలా?: లక్ష్మణ్‌

కేసీఆర్‌ బొమ్మ.. దుర్మార్గం: రేవంత్‌ 

సమకాలీనతకు అద్దంపట్టే చిత్రాలు

మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి

అప్పట్లో రాజులు కూడా ఇలా చేయలేదు

ఈనాటి ముఖ్యాంశాలు

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల పోటాపోటీ

యాదాద్రిపై కారు బొమ్మా?

యాదాద్రిపై నీ బొమ్మలెందుకు?

నల్లమల అగ్నిగుండంగా మారుతుంది: చాడ

డీజేలు,డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదు..

ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఫలితం

పబ్లిసిటీ కోసం గాలి మాటలొద్దు..

మెదక్‌ చర్చి నిర్మాణం అద్భుతం..

ఎలక్ట్రిక్‌ బైక్‌పై రయ్‌రయ్‌!

లేడీ కిలాడి.!

జిల్లాలో మృత్యు పిడుగులు

పోలీస్‌ కేసుకు భయపడి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే

రాణీ త్రిష

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది