అతివకు అండ.. 

8 Mar, 2019 01:30 IST|Sakshi

మహిళల భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు

స్వాతి లక్రా నేతృత్వం 

షీటీమ్స్, భరోసా కేంద్రాలు దీని పరిధిలోనే.. 

నేడు ప్రారంభించనున్న హోంమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటీమ్స్, సీసీకెమెరాలు వంటివాటితో మంచి ఫలితాలతోపాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్న పోలీసు శాఖ అతివకు అండగా మరో కార్యక్రమం చేపట్టింది. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, మానవ అక్రమరవాణా వంటి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐజీపీ స్వాతి లక్రా నేతృత్వంలో ‘వుమెన్‌ సేఫ్టీ వింగ్‌’ను ఏర్పాటు చేసింది. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా లక్డీకాపూల్‌లోని ఈ విభాగం కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు. షీటీమ్స్‌ పోలీసులు, భరోసా కేంద్రాలు (మహిళలు, చిన్నారులకు న్యాయ, వైద్య సాయం అందించే కేంద్రాలు) ఈ విభాగం కింద ఉంటాయి. ఈ కార్యాలయంలో పనిచేసే వారిలో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్పీ, ఒక ఏఎస్పీ ర్యాంకు అధికారి,  ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యాలయంలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన సీసీటీఎన్‌ఎస్‌ (క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌) సాయంతో ప్రతీ స్టేషన్‌ డేటాను అనుసంధానిస్తారు. ఫలితంగా వివిధ కేసుల స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చు. కేసుల పురోగతి, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడా రూపొందించారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగానికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాలను డీఎస్‌ఆర్‌ (డెయిలీ సిట్యువేషన్‌ రిపోర్ట్‌) ద్వారా పర్యవేక్షిస్తారు. దీంతోపాటు ప్రతీనెలా కేసులపై సమీక్ష నిర్వహిస్తారు. తద్వారా కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపడం, చార్జిషీట్‌ దాఖలు చేయడం సాధ్యమవుతాయి. ఫలితంగా బాధితులకు సత్వర సాయం అందే వీలుంటుంది.

నేడు మహిళా ఉద్యోగులకు సెలవు 
సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (మార్చి 8) రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం సచివాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని టవర్‌ ఎక్కిన వ్యక్తి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..! 

డొక్కు బస్సులే దిక్కు !

పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు

కథ కంచికేనా !

డెంగీ.. డేంజర్‌

ఇక ఇంటికే  ఈ– చలాన్‌ 

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

మొక్కుబడి గ్రామసభలకు చెక్‌ 

భాష లేనిది.. నవ్వించే నిధి

ఓడీఎఫ్‌ సాధ్యమేనా.?

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..!

నా కొడుకును బతికించరూ..

చేయూతనందిస్తే సత్తా చాటుతా..!

ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే

మన ఇసుకకు డిమాండ్‌

పాతబస్తీలో పెరుగుతున్న వలస కూలీలు

శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ 

వానాకాలం... బండి భద్రం!

దేవుడికే శఠగోపం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!