మనో నేత్రంతోనే అమ్మవారిని చూస్తున్నాం

23 Jul, 2015 10:19 IST|Sakshi
మనో నేత్రంతోనే అమ్మవారిని చూస్తున్నాం
  •     అమ్మ ఆశీస్సులతోనే  ఉద్యోగం వచ్చింది
  •      ఇక్కడి ఆదరణ మరిచిపోలేం
  •      బాసరలో అంధవిద్యార్థులు
  • బాసర నుంచి సాక్షి బృందం :
     హైదరాబాద్ ఉస్మానియూ యూనివర్సిటీ అంధ విద్యార్థులు బుధవారం బాసరలో పుష్కరస్నానం ఆచరించారు. నది ఒడ్డున ఉన్న సూర్యేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మహేశ్, వెంకన్న, స్వామినాయక్, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, బాన్సువాడకు చెందిన నాగేశ్, బోధన్‌కు చెందిన బానుకుమార్ మాట్లాడుతూ అమ్మ ఆశీర్వాదంతోనే తాము ఇక్కడికి వచ్చామన్నారు. రెండు కళ్లులేకపోయినా మనోనేత్రంతో పుష్కర వైభవాలు చూడగలుగుతున్నామని, ఇక్కడి వాలంటీర్లు ఎంతగానో సహకరించారని ఆనందం వ్యక్తంచేశారు.
     మదిలో పదిలం
     బాసర పరిసరాలు అన్ని మేము తెలుసుకోగలుగుతున్నాం. రెండు కళ్లు లేకపోయినా అమ్మ మాకు ఇచ్చిన మనోనేత్రం తో పుష్కర వైభవాలు తెలుసుకున్నాం. బాసరకు రాగానే ఇక్కడి వారంతా ఎం తో సహకరిస్తున్నారు. వాలంటీర్ల సేవలు మరిచిపోలేం. బాసర పుష్కరాలను పదిలంగా మదిలో దాచుకుంటాం.
     - స్వామినాయక్
     అమ్మదయవల్లే ఉద్యోగం
     రెండు కళ్లులేకపోయినా 2003 పుష్కరాల్లో బాసరకు వచ్చి స్నానం ఆచరించాను. ఆనాడు మనస్ఫూర్తిగా సరస్వతీ అమ్మవారిని మొక్కుకున్నాను. సీఈలో ఎంఏ పూర్తిచేసిన నాకు సరస్వ తీ మాత కటాక్షంతోనే బ్యాంకు ఉ ద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక మళ్లీవచ్చిన మహాపుష్కరాలకు మిత్రులతో కలిసి వచ్చాను.
     - భానుకుమార్

మరిన్ని వార్తలు