ఎన్నికల ప్రకటనే మిగిలింది..

2 Apr, 2019 16:38 IST|Sakshi
చందంపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం 

సాక్షి, చందంపేట : ఈనెల 11న లోక్‌సభ ఎన్నికలకు నిర్వాహణకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు మండల పరిషత్‌ ఎన్నికల పక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉమ్మడి చందంపేట మండలంలోని నేరెడుగొమ్ము మండల కేంద్రంగా కొత్త మండల పరిషత్‌ ఏర్పాటుకు ప్రకటన విడుదలైన విషయం తెలిసింది. దీంతో చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని 47 పంచాయతీల్లో ఎక్కడ చూసినా లోక్‌సభతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల చర్చే గ్రామాల్లో సాగుతోంది. చందంపేట మండల పరిషత్‌ పరిధిలో రిజర్వేషన్ల పక్రియ ఇప్పటికే పూర్తయింది. కాగా మండలంలో 9 ఎంపీటీసీల పరిధిలో తుది జాబితాను అధికారులు ప్రకటించారు. చందంపేట మండలంలో 43 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 14,454 మంది పురుషులు, 13,517 మంది స్త్రీలు మొత్తం 27,971 మంది ఓటర్లు ఉన్నారు. నేరెడుగొమ్ము మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 25 పోలింగ్‌ కేంద్రాలు, 9077 మంది పురుషులు  8,717 మంది మంది మహిళలు ఉన్నారు. మొత్తం 17,794 మంది ఓటర్లున్నారు.

 
పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్న అధికారులు తదనుగుణంగా ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నారు. ప్రతి పంచాయతీలో కనీసం ఒక పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో బూత్‌లో 600 మంది ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని, ప్రత్యేక అధికారి ఖాసీం వెల్లడించారు. చందంపేట మండలంలో 43, నేరెడుగొమ్ము మండలంలో 25 పోలింగ్‌ కేంద్రాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉన్నతాధికారులు సమీక్షించి ఫైనల్‌ చేయడమే మిగిలింది. 

మరిన్ని వార్తలు