7 కొత్త కార్పొరేషన్లు

19 Jul, 2019 01:51 IST|Sakshi

కొత్త పుర చట్టంతో ఏర్పాటు.. సీఎం కేసీఆర్‌ ప్రకటన 

మున్సిపల్‌ చట్టాల సవరణ 

ఆర్డినెన్స్‌ బిల్లుకు సభ ఆమోదం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ఉండగా, కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా మరో ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని కార్పొరేషన్ల సంఖ్య 13కు చేరనుంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో శివారు గ్రామాలు చేరడంతో జనాభా పెరిగిందని, ఆ మేరకు వార్డుల సంఖ్య సైతం పెంచి మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ చట్టాలకు సవరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీంతో అత్యవసర ఆదేశాల(ఆర్డినెన్స్‌) రూపంలో మున్సిపల్‌ చట్టాలకు సవరణ చేసి వార్డుల సంఖ్యను పెంచామన్నారు. మున్సిపల్‌ చట్టాల సవరణ ఆర్డినెన్స్‌ బిల్లును ఆయన గురువారం సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్రం లో అనేక  సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రజల సౌకర్యం, సౌలభ్యం, సంక్షేమం కాంక్షించి చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు.  మున్సిపల్‌ చట్టాల సవరణ ఆర్డినెన్స్‌ బిల్లును కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఆమోదించినట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు.

మరిన్ని వార్తలు