వడదెబ్బకు ఏడుగురి మృతి 

17 Apr, 2018 03:29 IST|Sakshi

ఏటూరునాగారం/గార్ల/లింగంపేట: వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘణపురం గ్రామానికి చెందిన గీకురు సారయ్య (65), మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం బుద్దారం తండాకు చెందిన బానోత్‌ తార (45), కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లికి చెందిన పిట్ల నారాయణ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం జక్కలొద్ది గ్రామ సమీపంలో ఓ యాచకుడు(40), నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన కుంచెపు నడిపన్న (47), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి తండాకు చెందిన బానోతు రాములు (35), ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గొల్లగూడెంకు చెందిన కొత్తపల్లి రాఘవులు(45) వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు