గ్రీన్ చానల్ కింద షాదీ ముబారక్!

13 May, 2015 02:09 IST|Sakshi

ట్రెజరీ ఆంక్షలు లేకుండా నిధులు
 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి గ్రీన్ చానల్‌ను వ ర్తింపజేసింది. ట్రెజరీ ఆంక్షలను లేకుండా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక తోడ్పాటు కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ లబ్ధిదారుల వార్షిక ఆదా య పరిమితి రూ. 2 లక్షలు, గ్రామీణ  లబ్ధిదారుల వార్షిక ఆదాయ పరిమితిని రూ. 2 లక్షల నుంచి 1.50 లక్షకు తగ్గించింది.

జనన ధ్రువీకరణపత్రం తప్పనిసరి అనే నిబంధనను సడలించి రేషన్, ఓటరు ఐడీ, ఆధార్ కార్డులను వయస్సు  ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని స్పష్టం చేసింది. గత ఏడాది పథకం ఆరంభంలో ఎదురైన అవరోధాలను అధిగమించేందుకు చర్య లు చేపట్టడంతో షాదీ ముబారక్ పథకానికి గ్ర హణం వీడినట్లయింది. లబ్ధిదారులకు నిధులు మంజూరైనా ట్రెజరీ శాఖ ప్రతినెల 5 నుంచి 18 తేదీ వరకు మాత్రమే బిల్లులను ఆమోదించడంతో సకాలంలో లబ్ధి అందడంలేదు. తాజాగా ట్రెజరీల ద్వారా నిధులు విడుద లై బ్యాంకు ఖాతాల్లో జమా అవుతాయి.  
 
పెళ్లి తర్వాత కూడా..

 
షాదీ ముబారక్ పథకం కోసం పెళ్లి తర్వాత కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. వివాహానికి సంబంధిం చిన ఫొటోను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాల్సి ఉంటుంది. 2014 అక్టోబర్ 2 తర్వాత ఆడబిడ్డల పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలు ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకుంటే మాత్రం వివాహ ఆహ్వానపత్రం, ఇతర పత్రాలను సమర్పించాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కేవలం 40 రోజుల్లో షాదీ ముబారక్ పథకం కింద  6,913 నిరుపేద కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే 2,335 మందికి, గత ఆర్థిక సంవత్సరం 5,839  కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే  5,414 మందికి లబ్ధిఅందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
దళారులను నమ్మవద్దు

షాదీ ముబారక్ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. వివాహానికి ముందు కానీ, తర్వాత కానీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దళారులను నమ్మవద్దు.  మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. హెల్ప్‌లైన్ నంబర్ 040-24760452 కు ఫోన్‌చేసి సహకారం పొందవచ్చు.
 -మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్,
 డెరైక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖ
 

మరిన్ని వార్తలు