మోదీ ఆరెస్సెస్పై నిషేధం విధిస్తారా?

1 Nov, 2014 14:23 IST|Sakshi

హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలే ఆదర్శమంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...పటేల్ చేసినట్లుగానే (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్) ఆరెస్సెస్పై నిషేధం విధిస్తారా అని కాంగ్రెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ మహాత్మాగాంధీని చంపిన ఆరెస్సెస్ను పటేల్ నిషేదించారన్నారు.

ఆరెస్సెస్ భావజాలంలో ఎదిగిన మోడీ...పటేల్ను ఆదర్శంగా తీసుకుంటామన్న దానిని ఆచరించి చూపాలన్నారు. ఆరెస్సెస్ను నిషేధించినప్పుడే మోడీ చిత్తశుద్ధి రుజువవుతుందని షబ్బీర్ అన్నారు. సిక్కుల ఊచకోతపై ఇప్పటికే కాంగ్రెస్ చాలాసార్లు క్షమాపణ చెప్పిందన్నారు. అయితే గుజరాత్లో జరిగిన గోథ్రా మారణకాండకు బీజేపీ, మోదీలు ఇప్పటివరకూ క్షమాపణ కోరలేదన్నారు.

రైతులకు ఎనిమిది గంటల విద్యుత్ ఇస్తామన్న హామీని మరచిన ముఖ్యమంత్రి కేసీఆర్పై చీటింగ్ కేసు పెట్టాలని షబ్బీర్ అలీ అన్నారు. సమస్యలన్నింటికీ కాంగ్రెస్సే కారణమనటం సీఎం చేతకానితనమని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు పగ్గాలిస్తే రైతులకు కరెంట్ ఎలా ఇవ్వాలో చేసి చూపిస్తామని షబ్బీర్ అలీ సవాల్ చేశారు.

మరిన్ని వార్తలు