ఎమ్మార్వో ఇంట్లో మరిన్ని ల్యాండ్‌ డాక్యుమెంట్లు

8 Jun, 2020 10:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట్‌ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించిన కూడా ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు, నగలు విషయంలో సుజాత ఆధారాలు చూపించలేదని తెలిసింది. శాలరీ డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేశానని సమాధానం చెప్పినట్లు సమాచారం. బ్యాంక్‌ నుంచి డ్రా చేస్తే డాక్యుమెంట్లు చూపించాలని ఏసీబీ అధికారులు అడిగినా కూడా ఆమె స్పందించ లేదని సమాచారం. సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్‌ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోమవారం మరో ఆమెను విచారించే అవకాశం ఉంది. (రూ.30 లక్షలు ఎక్కడివి?)

కాల్‌ లిస్టులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు
ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. రెండు రోజుల పాటు ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్, ఎమ్మార్వో సుజాతలను సుదీర్ఘంగా అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముగ్గురి‌ స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్ లను రిమాండ్ కు తరలించారు. లంచం కేసులో సుజాత పాత్ర ఉందని తేలితే సుజాతను కూడా రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది.
(అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్‌)

మరిన్ని వార్తలు