అణగారిన కులాలు ఏకం కావాలి : గద్దర్

11 Mar, 2015 03:59 IST|Sakshi
అణగారిన కులాలు ఏకం కావాలి : గద్దర్

బషీర్‌బాగ్: జాతిని ప్రేమించే వారే ఆ జాతికోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనకాడబోరని గద్దర్ అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రజక (దోభీ) అభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో రజక శంఖరావం మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ప్రాణాలర్పించిన ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై నెలకొల్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, శ్రమ జీవులు భూమికీ దూర మయ్యారని ఆరోపించారు.

ఆర్థిక సమానత్వం వచ్చినప్పుడే, రాజకీయ సమానత్వం వస్తుందని అందుకోసం ప్రజలు, అణగారిన కులాలు ఏకం కావాలన్నారు. ఈ సందర్భంగా తాను రాస్తున్న ‘ఊరి చరిత్ర’ ను పాటల ద్వారా వివరించారు. తెలంగాణ రజక అభివృద్ధ్ది సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎం. అంజయ్య మాట్లాడుతూ రజకులు 18 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా గుర్తింపు పొందారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చర్య లు తీసుకోవాలని, రజక వృత్తి దారులకు పెన్షన్ ఇప్పించాలని కోరారు. చాకలి ఐల మ్మ, గాడ్గె బాబా మహరాజ్‌ల పేర్లతో విద్యాలయా భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. త్వరలో తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సభకు గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం. నర్సింహ్మ అధ్యక్షత వ హించగా, నాయకులు వీర్ల వల్లీ శంక ర్, జి. మల్లయ్య, బి. చుక్కయ్య, చిమల శంకర్, సత్యనారాయణ, బండిరాల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు