గోదావరిలో చిక్కిన గొర్రెల కాపరులు

16 Sep, 2017 02:57 IST|Sakshi
గోదావరిలో చిక్కిన గొర్రెల కాపరులు

ప్రవాహంలో కొట్టుకుపోయిన 30 గొర్రెలు
నదిలో మరో 120 గొర్రెలు


జన్నారం(ఖానాపూర్‌): గోదావరి నదిలో ప్రవాహం పెరగడంతో గొర్రెలు మేపడానికి వెళ్లిన  నలుగురు కాపరులు నీటిలో చిక్కుకుని గ్రామస్తుల సహాయంతో శుక్రవారం బయటపడ్డారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులు జాడి రాజలింగు, జరుపుల లక్ష్మణ్‌నాయక్, జూలపెల్లి రాజన్న, జాడి రవి గొర్రెలను మేపేందుకు గోదావరి అవతల ఉన్న అడవికి వెళ్లారు.

సాయంత్రం మేకలను ఇంటికి తీసుకొస్తూ గోదావరి దాటుతుండగా ప్రవాహం పెరిగింది. దీంతో గోదావరి మధ్యలో ఉన్నవారు కేకలు వేశారు. దీంతో పుట్టిగూడకు చెందిన భూక్య రమేశ్, జరుపుల రవి, జాడి రవితోపాటు మరి కొందరు తాళ్ల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. ప్రవాహానికి 30 గొర్రెలు గోదావరి లో కొట్టుకుపోయాయి. మరో 120 గొర్రెలు గోదావరిలో చిక్కుకున్నాయని, ప్రవాహం పెరిగితే అవి కొట్టుకుపోయాయని తెలిపారు. తహసీల్దార్‌ మనోహర్‌రావు ఘటనాస్థలానికి  వెళ్లి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. గొర్రెలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తామని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు