ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు

13 Nov, 2018 08:37 IST|Sakshi

బంజారాహిల్స్‌: కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా గమ్మున కూర్చుంటారు. దీనివల్ల ప్రశ్నించే హక్కు కోల్పోతారు. ఆ పరిస్థితి ఎదురు కాకూడదనుకుంటే నిజాయితీతో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇదే విషయాన్ని రాజ్యాంగం చెబుతోంది. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఒక్కసారి ఓటు వేయకపోతే ఐదేళ్ల వరకు తలవంచాల్సి ఉంటుంది. ఓటేసిన తర్వాత తలెత్తుకు తిరిగేలా ఉండాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. మన హక్కును మనం కాపాడుకోవాలి. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు వేస్తాను. ఆ రోజు షూటింగ్‌లు ఉన్నా ఆలస్యంగానైనా వెళ్తాను కానీ ఓటు వేయడం మాత్రం మానను.– శివబాలాజీ,సినీనటుడు, బిగ్‌బాస్‌–1 విజేత

మరిన్ని వార్తలు