యాదాద్రిలో శివాలయం

12 Dec, 2016 14:39 IST|Sakshi
యాదాద్రిలో శివాలయం

ఎకరం స్థలంలో విస్తరణ.. పంచాయతన సైకత శివాలయంగా..
 
 యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మినారసింహస్వామి పుణ్యక్షేత్రం విస్తరణలో భాగంగా కొండపై గల శివాలయం అభివృద్ధిపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. కొండపై ఎకరం స్థలంలో శివాలయాన్ని మరింత సువిశాలంగా విస్తరించనున్నారు.  ఈ నేపథ్యంలో ఇటీవల తోగుట్ట పీఠాధిపతి మాధవానంద స్వామీజీ ఆలయాన్ని, ప్లాన్‌ను పూర్తిగా పరిశీలించి వైటీడీఏ అధికారులతో సమాలోచనలు జరిపారు. రానున్న రోజుల్లో పంచాయతన సైకత శివాలయంగా పేరు గాంచనున్నట్లు పండితులు,  జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.

ఎకరం స్థలంలో రాహుకేతు ఆలయం, దక్షిణ ముఖంగా ఆంజనేయస్వామి, పార్వతీదేవి, గణపతి ఆలయాలతోపాటు ప్రత్యేకంగా మణిమయ ఆలయం నిర్మించనున్నారు. వీటితోపాటు రామాలయం, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, రాహుకేతువులు, నవగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. సైకత లింగం లేదా స్పటిక లింగం తేనున్నారు. భక్తుల అభిషేకాలకు ప్రత్యేక స్పటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. కార్తీకదీపాలకు ప్రత్యేక మండపం, తూర్పుఈశాన్యంలో పార్వతి  ఆలయం రానుంది.

 రూ.500 కోట్లతో అభివృద్ధి
 యాదాద్రికి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం శివాలయానికి వెళ్లడం ఆనవారుుతీ. అందుకే  శివాలయాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.  సుమారు రూ.500 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిసింది. ఫిబ్రవరిలో పనులను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు