షాపింగ్ లాబీయింగ్‌పై దుమారం

14 Oct, 2014 04:02 IST|Sakshi
షాపింగ్ లాబీయింగ్‌పై దుమారం

వనపర్తిటౌన్:
 వనపర్తి మునిసిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల కే టాయింపుపై సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. ‘సాక్షి’లో సోమవా రం ‘షాపింగ్’..లాబీయింగ్! శీర్షికన ప్రచురితమైన కథనాన్ని చూపుతూ టీఆర్‌ఎస్ కౌ న్సిలర్లు గట్టుయాదవ్, ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. పత్రికల్లో కథనాలు వస్తు న్నా.. పట్టించుకోరా? అని నిలదీశారు.

సభ్యుల ప్రశ్నల కు సమాధానం చెప్పలేక అధికారులు ఇరకాటంలో పడ్డా రు. 44 షాపింగ్ కాంప్లెక్స్ మాల్ కేటాయింపులో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు కమిటీ వేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకు ఎందుకు వేయలేదని సభ్యులు నిలదీశారు. మునిసిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎక్స్‌అఫిషియో సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి హాజరయ్యారు.

మొదట కాంప్లెక్స్‌ల కేటాయింపులకు సంబంధించిన పత్రాలు, రికార్డులు ఎక్కడున్నాయని చైర్మన్ ఎదుట కౌన్సిలర్లు వాదనకు దిగారు. తాగునీటి బోర్‌లకు సంబంధించిన వన్‌హెచ్‌పీ మోటార్‌లకు రూ.35 వేలు, రూ.40వేల బిల్లులు ఎలా వచ్చాయని మునిసిపల్ అధికారులు కోటేషన్ తీసుకొచ్చిన షాపుల్లోనే రూ.21వేలకు మించి బిల్లులే వేయడం లేదని కౌన్సిలర్లు సతీష్‌యాదవ్, గట్టుయాదవ్ నిలదీశారు. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేయడంతో కమిషనర్ గౌస్‌మొహీద్దీన్ క్షమాపణలు కోరారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన అవినీతిపై విచారించేందుకు 15 మంది సభ్యులను నియమించారు. సమావేశంలో డీఈ రీయాజోద్దీన్, ఏఈ యూనోస్, ఆర్వో వెంకటేశం, మేనేజర్ నరేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు