సరి,బేసితో సడలింపులు

7 May, 2020 13:26 IST|Sakshi
దుకాణానికి నంబర్‌ వేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌

కాగజ్‌నగర్‌మున్సిపల్‌లో దుకాణాలకు అనుమతి

కాగజ్‌నగర్‌: జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సరిబేసి సంఖ్యల ఆధారంగా అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా కట్టడిలో భాగంగా అన్ని రకాల వ్యాపార సముదాయాలు మూసివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి దుకాణాలు తెరుచుకునేలా బుధవారం మున్సిపాలిటీ చైర్మన్‌ ఎండీ సద్దాం హుస్సేన్, ఇన్‌చార్జి కమిషనర్‌ రవిక్రిష్ణ దుకాణాలకు నంబర్లు కేటాయించారు. సరి సంఖ్య, బేసి సంఖ్యల ఆధారంగా దుకాణాలు తెరుచుకోవచ్చని సూచించారు.

ఒక దుకాణం పక్కన మరో దుకాణం తెరవకూడదని అన్నారు. మెడికల్, కిరాణ షాపులకు మినహాయించి అన్ని రకాల దుకాణాలకు నంబర్లు కేటాయించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ మాట్లాడుతూ పట్టణ ప్రజలు భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రవిక్రిష్ణ మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలోని వ్యాపారులు నిబంధన మేరలకు దుకాణాలు కొనసాగించాలని సూచించారు. శానిటైజర్లను షాపు ఎదుట అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి సిబ్బంది సాయికృష్ణ, క్రాంతి, బంగారు శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు