మే చివరికల్లా పుష్కరాల పనులు పూర్తి చేయాలి

8 Mar, 2015 04:21 IST|Sakshi
మే చివరికల్లా పుష్కరాల పనులు పూర్తి చేయాలి

హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనులను మే చివరికల్లా పూర్తి చేయాలని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్‌లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఆలోపే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.  ఇప్పటికే 66 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించిందని, అదనంగా మరో 16 కొత్త ఘాట్ల కోసం సీఎం నుంచి అనుమతి కోరామన్నారు. పుష్కర ఏర్పాట్లపై ఆయన వివిధ విభాగాలతో శనివారం సమీక్షించారు.

ఉత్సవాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ దిశలోనే చర్యలు తీసుకోవాలన్నారు. స్నాన ఘట్టాలు సులభంగా తెలుసుకునేలా రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. రూ.82.33 కోట్లతో 66 పుష్కర, స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు