‘ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి’

23 Jul, 2018 01:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీఈఏ) డిమాండ్‌ చేసింది. ఆదివారం టీఈఏ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కార్యదర్శి సంపత్‌కుమార్‌ స్వామి మాట్లాడారు.

తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ 17వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని, ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వా లన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు రప్పించాలని, ఈపీటీఆర్‌ఐలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు