సర్వే అధికారులకు ఈ రుజువులు చూపండి

15 Aug, 2014 02:03 IST|Sakshi
సర్వే అధికారులకు ఈ రుజువులు చూపండి

సర్వే కోసం 19న ఇంటికి వచ్చే ఎన్యూమనేటర్లకు కుటుంబానికి సంబంధించిన వాస్తవ వివరాలు తెలియజేయడంతో పాటు వారి అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉన్న కొన్ని రుజువులు చూపాల్సి ఉంటుంది. సర్వే సమయంలో ఉన్న చిరునామా కాకుండా ఇతర ప్రాంతాల చిరునామాలతో ఆ పత్రాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు చూపించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు గత సంవత్సరం అద్దె ఇంట్లో ఉండి అదే ఇంటి నంబరుతో ఆధార్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు పొంది ఉన్న వారు తరువాత వేరే ఇంట్లోకి మారినట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా చెప్పడంతో పాటు పాత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు నంబరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పవచ్చు. 

సర్వే అధికారులు అడిగితే చూపించాల్సిన మరికొన్ని పత్రాలు...

ఆధార్ కార్డు
* వాహన రిజిస్ట్రేషన్ కార్డు
* ఇంటి అసెస్‌మెంట్, ఇంటి పన్ను రసీదు కరెంట్ బిల్లు
* ఎల్పీజీ కనెక్షన్ పుస్తకం
* బ్యాంక్, పోస్టాఫీసు పాసు పుస్తకం
* కులం, జనన ధ్రువీకరణ పత్రం
* విద్యార్థులు చదువుకున్న పత్రాలు(మెమో, టీసీ వంటివి)
* వికలాంగుల ధ్రువీకరణ పత్రం(సదరం సర్టిఫికెట్)
వాహనాల రిజిస్ట్రేషన్ కాపీ కార్డు
* వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం
* ఓటర్ ఐడీకార్డు, పాన్‌కార్డు
* ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందితే ఇందిరమ్మ ఇల్లు, వంటి వాటి కేటాయింపు సర్టిఫికెట్. పెన్షనర్ల ఐడీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

మరిన్ని వార్తలు