'ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపా'

15 Aug, 2014 19:12 IST|Sakshi

హైదరాబాద్: నకిలీనోట్ల ముఠా చేతిలో గాయపడి చికిత్స అనంతరం కోలుకున్న ఎస్‌.ఐ.వెంకటరెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. శామీర్‌పేటలో ఎల్లంగౌడ్‌ గ్యాంగ్‌ చేతిలో వెంకటరెడ్డి గాయపడ్డారు. సిద్ధిపేట కేంద్రంగా నకిలీనోట్లు చెలమణి అవుతున్నాయని, దీనికి ఎల్లంగౌడ్ ప్రధాన సుత్రధారి అని వెంకటరెడ్డి తెలిపారు. శామీర్‌పేట ఘటనలో తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకే కాల్పులు జరిపామని వెల్లడించారు.

మొదటిగా రఘు, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నామని, వారిని విడిపించేందుకు శ్రీకాంత్‌, ఎల్లంగౌడ్‌, ముస్తాఫాలు శామీర్‌పేటకు వచ్చారని చెప్పారు. వస్తూనే ముస్తాఫా మాపై దాడి చేశాడని, కానిస్టేబుల్ ఈశ్వరరావును దారుణంగా హత్యచేశారని తెలిపారు. ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, మేం పోలీసులమని గ్రహించి ఎల్లంగౌడ్‌, శ్రీకాంత్‌లు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు.

మరిన్ని వార్తలు