స్వీయ నిర్బంధంలోకి సిద్దిపేట కలెక్టర్‌

12 Jun, 2020 08:01 IST|Sakshi

అక్కడి నుంచే కార్యకలాపాలు

సాక్షి, సిద్దిపేట : తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి గురువారం సెల్ఫ్‌ హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచే ఆయన జిల్లా అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. కొండపోచమ్మసాగర్‌ ముంపు గ్రామమైన పాములపర్తి,మరికొన్ని ఇతర గ్రామాల ప్రజలు ఇళ్ల నిర్మాణాల కోసం హెచ్‌ఎండీఏ అనుమతి పొందే విషయమై ఇటీవల కలెక్టర్‌ను కలిశారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతడిని హైదరాబాద్‌కు తరలించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. (భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదు)

ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలపై కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అర్జీల స్వీకరణ పెట్టెల్లో అర్జీలు వేయాలని, వాటిపై తమ ఫోన్‌ నంబర్‌ రాయాలని కలెక్టర్‌ సూచించారు. ఆయా దరఖాస్తులను వివిధ శాఖలకు చెందిన అధికారుల ద్వారా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని, 30 నుంచి 45 రోజుల్లో సమస్యకు సమాధానం చెబుతామని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు