పూర్వ విద్యార్థులు కాదు.. అపూర్వ విద్యార్థులు

8 Feb, 2020 16:28 IST|Sakshi

సిద్ధిపేట ప్రభుత్వ పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు పూర్వ విద్యార్థులు కాదని.. అపూర్వ విద్యార్థులని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం సిద్ధిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల(మల్టీపర్పస్‌ హైస్కూల్‌) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ..  చరిత్ర కలిగిన పాఠశాల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈచ్‌ వన్‌, టిచ్‌ వన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టే ప్రతి కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

పాఠశాల అభివృద్ధికి రూ.25 లక్షలు..
75 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సిద్ధిపేట ప్రభుత్వ పాఠశాల ఎందరో మేధావులను అందించిందని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్‌, రఘోత్తమ్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు