సిద్దిపేట చైర్మన్ పీఠం టీఆర్ఎస్ కైవసం

11 Apr, 2016 09:59 IST|Sakshi
సిద్దిపేట చైర్మన్ పీఠం టీఆర్ఎస్ కైవసం

సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22 స్ధానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించగా..ఏడు చోట్ల ఇండిపెండెంట్లు, రెండేసి చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలవగా ఎంఐఎం ఒక స్థానంలో బోణి కొట్టింది.

మొత్తం 34 వార్డులకు ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. చైర్మన్ పీఠానికి 18 సీట్లు బలం అవసరం కాగా టీఆర్ఎస్ 22 సీట్లు గెలిచి చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్లు గెలిచిన ఏడు సీట్లలో ఆరు చోట్ల టీఆర్ఎస్ రెబెల్స్ గెలవగా ఒక చోట టీడీపీ రెబెల్ అభ్యర్ధి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీకు భంగపాటు తప్పలేదు. ఖాతా తెరవకుండానే చతికిలపడింది. సిద్దిపేట క్లీన్‌స్వీప్‌పై టీఆర్‌ఎస్ పార్టీ పెట్టుకున్న ఆశలు ఆవిరైనట్లైంది. అనూహ్యంగా ఇండిపెండెంట్లు దూసుకుపోయారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత  జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధించింది. కానీ ఈ సారి రెబెల్స్ తో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గెలిచిన అభ్యర్థుల వివరాలు

వార్డు నెం.

అభ్యర్థి పేరు పార్టీ
1 మల్లికార్జున్ టీఆర్ఎస్
2 లలిత ఇండిపెండెంట్
3 సంధ్య టీఆర్ఎస్
4 దీప్తి ఇండిపెండెంట్
5  స్వప్న ఇండిపెండెంట్
6 బాల్ లక్ష్మీ కాంగ్రెస్
7  ప్రశాంత్ టీఆర్ఎస్
8 నర్సింహులు టీఆర్ఎస్
9 ఉమారాణి టీఆర్ఎస్
10 వేణుగోపాల్ రెడ్డి టీఆర్ఎస్
11 రవీందర్ టీఆర్ఎస్
12 అత్తర్ పటేల్ టీఆర్ఎస్
13 వెంకట్ టీఆర్ఎస్ ఏకగ్రీవం
14 శ్రీకాంత్ బీజేపీ
15 భవాని టీఆర్ఎస్
16 రాజనర్సు టీఆర్ఎస్ ఏకగ్రీవం
17 వెంకట్ బీజేపీ
18 విజయలక్ష్మీ టీఆర్ఎస్ ఏకగ్రీవం
19 లత టీఆర్ఎస్ ఏకగ్రీవం
20 జావేద్ టీఆర్ఎస్
21 జ్యోతి టీఆర్ఎస్ ఏకగ్రీవం
22 ప్రవీణ్ ఇండిపెండెంట్
23 లక్ష్మీ టీఆర్ఎస్
24 శ్రీనివాస్ టీఆర్ఎస్ ఏకగ్రీవం
25 ప్రమీల ఇండిపెండెంట్
26 శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్
27 విజయరాణి ఇండిపెండెంట్
28 లక్ష్మీ టీఆర్ఎస్
29 శ్రీనివాస్ టీఆర్ఎస్
30 వజీర్ కాంగ్రెస్
31 కవిత టీఆర్ఎస్
32 ప్రభాకర్ టీఆర్ఎస్
33 మొయిన్ ఎంఐఎం
34 మంజుల ఇండిపెండెంట్

 

మరిన్ని వార్తలు