70 మంది విద్యార్థులకు అస్వస్థత

26 Dec, 2019 02:10 IST|Sakshi

చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలు 

సిద్దిపేట జిల్లాలో జ్యోతిబా పూలే విద్యార్థుల వ్యథ

సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థులు చర్మ సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. ముఖాలపై ఎర్రటి పొక్కులతో చర్మం పొలుసుబారడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా 70 మంది పిల్లలు అస్వస్థతకు గురైనప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మిణుగురు పురుగులు కుట్టడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. నారాయణరావుపేట జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మిస్తున్ననేపథ్యంలో స్కూల్‌ను తాత్కా లికంగా సిద్దిపేట శివారులోని ఎల్లంకి కళాశాల లోకి మార్చారు.

5వ తరగతి నుంచి 9వ తరగతివరకు 327 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. పాఠశాలలో పైఅంతస్తులోని డార్మిటరీ హాల్‌లో విద్యార్థులు నిద్రించేందుకు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా కొందరు విద్యార్థుల మొఖాలపై ఎర్రటి పొక్కులు ఏర్పడ్డాయి. బుధవారం పాఠశాలలో మొత్తంగా 70 మందికిపైగా పొలుసుబారిన చర్మంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ముఖాలపై చర్మం పొలుసుబారడం తగ్గకపోవడంతో పిల్లల అస్వస్థతకు గల కారణంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

వైద్య పరీక్షలు చేయిస్తున్నాం..
మిణుగురు పురుగులతో విద్యార్థులకు చర్మం పొలుసుబారిపోవడంతో వెంటనే వైద్యులకు చూపించాం. పిల్లలు డారి్మటరీ రూంలోని తెరలను తొలగించడంతో పురుగులు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో మెష్‌లు ఏర్పాటు చేసేలా చూసుకుంటాం.  
–మహబూబ్‌ అలీ, ప్రిన్సిపాల్‌

మరిన్ని వార్తలు