ఉన్ని దుస్తులకు భలే డిమాండ్‌ !

28 Nov, 2018 09:39 IST|Sakshi
ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్న ప్రజలు

 రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత

 ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్న ప్రజలు

 పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యాపారం 

సాక్షి, నల్లగొండ టౌన్‌ : చలికాలం రానే వచ్చింది. చలి రోజురోజుకూ  పెరుగుతుండడంతో పట్టణ ప్రజ లు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. సాయంత్రం నుంచి చలి ప్రారంభమై ఉదయం వరకు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం కాగానే ఉ న్ని దుస్తులను ధరిస్తూ చలినుంచి రక్షణ పొందుతున్నారు. 
పట్టణంలో పలుచోట్ల వెలిసిన దుకాణాలు
పట్టణంలోని గడియారం సెంటర్, దేవరకొండ రోడ్డు, హైదరాబాద్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు  20కిపైగా ఉన్ని దుస్తుల దుకాణాలను వెలిశాయి. చలి తీవ్రత కారణంగా ప్రజలు ఉన్ని దుస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడంతో దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా కనబడుతోంది.  మంకీ క్యాప్‌ రూ. 20 నుంచి రూ.50వరకు,స్వెట్లర్‌ రూ.150 నుంచి 500ల వరకు, మఫ్లర్‌ రూ.50 నుంచి రూ.100వరకు, చిన్నపిల్లల ఉన్ని దుస్తులు రూ.100 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. గత వారం మందకొడిగా సాగిన ఉన్ని దుస్తుల అమ్మకాలు చలి తీవ్రత పెరిగిపోవడంతో ఊపందుకున్నాయి. దీంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ధరలు ఎక్కువగా ఉన్నాయి..

చలికాలం కావడంతో చాలా మంది ఉన్ని దుస్తులను కొనడానికి వస్తుండడంతో వ్యాపారులు ధరలు ఎక్కువగా చెబు తున్నారు. ఏది కొనాలన్నా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ధరలు తగ్గించి అమ్మితే బాగుంటుంది.    – అనూష, నల్లగొండ 

అమ్మకాలు పెరిగాయి..

చలి పెరుగుతుండడంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు బాగానే పెరిగాయి. రెండు రోజులుగా  వ్యాపారం కాస్త ఎక్కువగా పెరిగింది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే మా వ్యాపారాలు సాగుతాయి. – రాజు, వ్యాపారి 
              

మరిన్ని వార్తలు