అక్టోబర్‌ మొదటి వారంలో బోనస్‌

20 Sep, 2019 03:36 IST|Sakshi

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: దసరా కానుకగా లాభాల బోనస్‌ను కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో అక్టోబర్‌ మొదటి వారంలో జమ చేస్తామని గురువారం సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. 2018–19లో సంస్థ సాధించిన రూ.1,763 కోట్ల లాభాల్లో 28 శాతం (రూ.493 కోట్ల)ను కారి్మకులకు బోనస్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. సీఎం చేసిన ప్రకటనపై సింగరేణివ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయని, కారి్మకులు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. బోనస్‌ చెల్లించడానికి తగు ఏర్పాట్లు చేయాలని సింగరేణి ఆర్థిక, పర్సనల్‌ విభాగాలను ఆదేశించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009–2014 వరకు పంచిన లాభాల బోనస్‌ రూ.314 కోట్లు మాత్రమేనని, తెలంగాణ వచ్చిన తర్వాత 2014–2019 వరకు భారీగా రూ.1,267 కోట్లను పంపిణీ చేశామన్నారు. ముఖ్యంగా సీఎం సింగరేణి కారి్మకులపై ప్రత్యేక అభిమానంతో గత ఐదేళ్ల కాలంలో ప్రతీ  ఏడాది లాభాల బోనస్‌ను పెంచుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు