జీడీకే–10 గని మూత!

23 Nov, 2018 18:06 IST|Sakshi
మూతపడనున్న పదో గని  

వచ్చే డిసెంబర్‌లో ముహూర్తం పెట్టిన సింగరేణి యాజమాన్యం

ఇప్పటికే కార్మికుల నుంచి బదిలీ దరఖాస్తుల స్వీకరణ

మిగిలిన బొగ్గు నిల్వలు వెలికితీసేందుకు ఆర్జీ–3లోని ఓసీపీ–1కు అప్పగింత

రామగిరి(పెద్దపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో మరో భూగర్భ గని మూతపడనుంది. సంస్థలో మొట్టమొదటి బీజీ(బ్లాస్టింగ్‌ గ్యాలరీ)ప్యానల్‌ ఏర్పాటు చేసిన 10వ గనిని మూసివేసేందుకు యాజమాన్యం ముహూర్తం ఖరారు చేసింది. ఈయేడాది డిసెంబర్‌లో 10వ గని మూసి వేసేం దుకు సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తు న్నారు. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు  520 మంది కార్మికులను బదిలీ చేయనున్నారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు.  157 మంది కార్మికులు ఆర్‌జీ–3 పరిధి ఓసీపీ–1, 2గనులకు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. మరో 180 మంది కార్మికులను ఇక్కడే ఉంచనున్నారు.

 1976లో ప్రారంభం  
1976లో ఏర్పాటు చేసిన జీడీకే–10 ఇంక్లైన్‌ గని ఎంతో మందికి ఉపాధి కల్పించింది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లోని కింది రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను  వెలికి తీయడం కోసం 1989లో సింగరేణి మొత్తానికి మొట్టమొదటి సారి ఈగనిలో బీజీ ప్యానల్‌ ఏర్పా టు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని నిర్దశించిన ఉత్తత్పి సాదించి ఈగనిలో వర్క్‌స్పాట్‌(పని స్థలం)దూరం పెరిగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్‌ వైడింగ్‌ షాఫ్టును ఎర్పాటు చేశారు. పనిస్థలం దూరం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రాకపోవడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో యాజమా న్యం ఈ గనిని మూసి వేసి ఆర్‌జీ–3 పరిధి ఓపీసీ–1కు అప్పగించాలని నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్‌లో ఉత్పత్తి నిలిపివేసి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.  

పెరుగుతున్న ఓసీపీ–1 జీవితకాలం 
జీడీకే–10వ గనిని మూసి వేసి ఆర్‌జీ–3 పరిధి లోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్సరాలు పెరుగుతుంది. 2019 డిసెంబర్‌లో ఓసీపీ–1 ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.
 
మూడేళ్లక్రితం 10ఏ మూసివేత 
సింగరేణ సంస్థలో మొట్టమొదటిసారి లాంగ్‌వాల్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని మూడు సంవత్సరాల క్రితం 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే–10ఏ గనిని 1985లో ఏర్పాటు చేశారు. భూగర్భంలో నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పైరెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏగనిలో లాంగ్‌వాల్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడీకే–10, జీడీకే–10ఏ ఇంక్లైన్‌ గనుల్లో సుమారు 336 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉండగా,  రెండు గనుల ద్వారా 34 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్‌ టన్నుల బొగ్గును ఓసీపీ–1 ద్వారా వెలికితీయాలని సింగరేణి భావిస్తోంది.

34మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి 
జీడీకే–10వ గనిని డిసెంబర్‌లో మూసి వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. జీడీకే–10, జీడీకే–10ఏ గనుల ద్వారా సుమారు 34 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పతి జరిగింది. మిగిలిన బొగ్గు నిక్షేపాలను ఓసీపీ–1 ద్వారా వెలికితీయనున్నాం.  ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏపీఏకు ఎలాంటి ముప్పు వాటిళ్ళకుండా రెండు డ్యాంలను నిర్మిస్తున్నాం.

                                             బి.వీరారెడ్డి, ఏపీఏ జీఎం 

మరిన్ని వార్తలు