సంజీవ్‌ దొరకలె..

9 Apr, 2020 12:14 IST|Sakshi
గనిలోకి వెళ్తున్న ఎమ్మెల్యే, జీఎం తదితరులు ,సంజీవ్‌

24గంటలు గడిచినా లభించని సింగరేణి కార్మికుడి ఆచూకీ

గాలిస్తున్న ప్రత్యేక బృందాలు

గోదావరిఖని(రామగుండం): గనిలోకి దిగి అదృశ్యమై 24 గంటలు గడిచింది.. ప్రత్యేక బృందాల ద్వా రా గనిలోని ప్రతీ ప్రాంతా న్ని క్షుణ్ణంగా గాలిస్తున్నా రు. షిఫ్ట్‌నకు 8 ప్రత్యేక బ్యాచ్‌లతో పెట్టి గనిలోని ప్రతి గుళాయిని జల్లెడ పడుతున్నారు.. అయినా జనరల్‌ మజ్దూర్‌ కార్మికుడు కొడెం సంజీవ్‌ ఆచూకీ మాత్రం లభించలేదు..

సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–1 పరిధిలోని జీడీకే –11గనిలో జనరల్‌ మజ్ధూర్‌గా ప నిచేస్తున్న కొడెం సంజీవ్‌(58) మంగళవారం మొద టి షిఫ్టులో ఆక్టింగ్‌ పంప్‌ఆపరేటర్‌ గనిలోని 4వ సీమ్, 27వ లెవల్, ఒకటవ డీప్‌లో 75హెచ్‌పీ పంప్‌ను నడిపించేందుకు వెళ్లాడు. మంగళవారం మొ దటి షిఫ్ట్‌లో పనిస్థలం వద్దకు వెళ్లిన అతడు రాత్రి షిఫ్ట్‌లో ఉన్న ఆపరేటర్‌ నుంచి చార్జ్‌ తీసుకున్నాడు. అయితే సాయంత్రం మూడు గంటలకు రెండో షిఫ్ట్‌కు వచ్చే ఆపరేటర్‌కు చార్జ్‌ ఇవ్వలేదు. పంప్‌ ర న్నింగ్‌లో ఉన్నప్పటికీ సంజీవ్‌ మాత్రం అక్కడ లేడు. దీంతో ఈ విషయాన్ని గని అధికారులకు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు పూర్తి వివరా లను సేకరించారు. గనిపైన సంజీవ్‌ అవుట్‌ మస్టర్‌ పడలేదు. ల్యాంప్‌ రూంలో కూడా లైట్‌ను అప్పగించలేదు. అతడి ద్విచక్రవాహనం గనిపైనే ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆర్జీ–1 జీఎం కె.నా రాయణకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆయన గనిపైకి చేరుకుని మంగళవారం రాత్రే గనిలోని పని స్థలాలను తనిఖీ చేసి వచ్చారు.

గనిలోకి దిగిన ఎమ్మెల్యే, మేయర్‌
సంజీవ్‌ అదృశ్యం కావడంతో బుధవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ గనిపై చేరుకున్నారు. జీఎం నారాయణతో కలిసి ఎమ్మెల్యే, మేయర్‌ అనిల్‌కుమార్, గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీ–1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, గోదావరిఖని టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు గనిలోకి దిగి కార్మికుడు పనిచేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.

సంప్‌లో గాలింపు..
అదృశ్యమైన కార్మికుడు పనిచేసిన పంప్‌నకు 500మీటర్ల దూరంలోని సంప్‌లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సంప్‌లో నీటిని పూర్తిగా తోడివేయగా, మిగిలిన 10మీటర్ల దూరం వరకు ఉన్న బురదలో కూడా గాలింపు నిర్వహిస్తున్నారు. ఆర్జీ– 1, 2, 3, ఏరియా సేఫ్టీ జీఎంలు కె.నారాయణ, సురేష్, సూర్యనారాయణ, బళ్లారి శ్రీనివాస్‌ గనిపైనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కార్మికుడి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

పరిస్థితిని సమీక్షించిన డైరెక్టర్‌(పా)
డైరెక్టర్‌(పా), ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ బుధవారం గనిపై చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. గనిలోకి దిగి కార్మికుడు పనిచేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. డైరెక్టర్‌ వెంట ఆర్జీ–1,2,3,ఏపీఏ,రెస్క్యూ, ఏరియా సేఫ్టీ జీఎంలు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు