రెండో రోజుకు చేరిన సింగరేణి కార్మికుల సమ్మె

3 Jul, 2020 09:25 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి:  సింగరేణి కార్మికుల సమ్మె రెండోరోజు కొనసాగుతోంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానలను మానుకోవాలంటూ కార్మికులు బుధవారం సమ్మెకు దిగారు. కార్మికులు ఎవరూ విధులకు హజరు కాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు గనులు బోసిపోయాయి. రామగుండం రీజియన్‌లో 7 భూగర్భ బొగ్గు గనులు, 4 ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులో మొదటి రోజు సమ్మె సంపూర్ణం కావడంతో కార్మికుల సంఘాల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే స్ఫూర్తితో మిగతా రెండు రోజులు కూడా సమ్మెను విజయవంతం చేయాలని జాతీయ సంఘాల జేఏసీ నాయకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు