మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

22 Jul, 2019 08:15 IST|Sakshi

సాక్షి, వనపర్తి : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు వనపర్తిలోని ఆమె స్వగృహానికి చేరుకున్నారు. కాగా, తారకమ్మ అంత్యక్రియలు నేడు సాయంత్రం స్వగ్రామంలో జరగనున్నట్టుగా సమాచారం.   

మరిన్ని వార్తలు